May 15, 2011
Jan 12, 2010
సంక్రాంతి శుభాకాంక్షలు
బ్లాగ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు "భోగి,కనుమ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు"
ఈ పండుగ మీ & మన జీవితాలలో వెలుగులు నింపాలని మనమందరం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ... సర్వేజనా సుఖినో భవంతు.
ఈ పండుగ మీ & మన జీవితాలలో వెలుగులు నింపాలని మనమందరం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ... సర్వేజనా సుఖినో భవంతు.
Dec 14, 2009
మీరు రాష్ట్రాలు విడగొడితే, నేను భూగోళం పగలగొడతా. ఖబడ్ధార్!
అర్థం కాలేదా?? అయితే వినండి. ఒకవేళ గుండ్రంగా ఉన్న భూగోళం బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తే??భయంగా ఉందా?? నిజం గా జరుగుతుందని కాదు. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చి, బద్దలు కొట్టటానికి సంసిద్దమైతే మన భూగోళాన్ని ఎన్ని విధాలుగా విడగోట్టొచ్చో తెలుసా??తెలుసుకోవాలని ఉందా? అయితే క్రింది వీడియో చూడండి.
ఆంద్రప్రదేశ్ ను విడగొట్టే ప్లాన్ ఎవరిచ్చరో తెలియటం లేదు. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. ప్లీస్...
ఆంద్రప్రదేశ్ ను విడగొట్టే ప్లాన్ ఎవరిచ్చరో తెలియటం లేదు. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. ప్లీస్...
Labels:
అంతర్మధనం
Nov 25, 2009
తొక్కలో ప్రాణాలు
మొన్నీ మద్య అర్ ఫిజాన్ క్యాంప్ దగ్గరకు వెళుతుంటే ఒక దృశ్యం కంటపడింది. అదేంటంటే వాటర్ రిహబిలేషన్ చేసే ట్యాంక్ లో ఏదో రిపేర్ ఉందనుకుంటా, ఒక హెలికాఫ్టర్ లోంచి మనిషిని అందులోకి తాడుకట్టి మరీ దించారు.పని అయ్యేంత వరకు హెలికాఫ్టర్ గాల్లోనే ఉంది లోపలున్న మనిషిని పట్టుకుని.
నాకైతే ముందు ఇదేం విడ్డురం రా బాబూ లోపల మనిషిని దించేసి పోవచ్చుకదా అనిపించింది. కానీ ఆలోచిస్తే అర్థమైంది సేఫ్టీ కోసం అని.మరి ఇండియా లో అయితే????
Labels:
అంతర్మధనం
Oct 28, 2009
Oct 25, 2009
కోతి చేతిలో కొబ్బరి చిప్ప VS కే.సి.ఆర్ చేతిలో పదవి
అనగనగా ఒక ఊరు.ఆ ఊరి గుడి దగ్గర ఒక కోతి.ఒక రోజు ఒక భక్తుడూ దేవున్ని దర్శనం చేసుకుని, కొబ్బరికాయ కొట్టీ.పూజారి లాక్కోగా మిగిలిన చిప్పతో గుడి మెట్లు దిగుతుండగా....సడన్ గా ఆ కోతొచ్చి ఆ మిగిలిన కొబ్బరిచిప్పను కూడా లాకెళ్ళింది.ఇప్పుడు ఆ కోతి భక్తుడి నోటి దగ్గర లాక్కొన్న కొబ్బరి చిప్పను తింటుందా?? పడేస్తుందా?? ఏమో ఏమైనా చేయ్యొచ్చు. కదా?
సేం టు సేం పైన చెప్పిన కోతిలాంటి మనిషి నా కొక్కడు తగిలాడు. ఎవడబ్బా అనుకుంటున్నారా?? ఇంకెవ్వరు మన కే.సీ.ఆర్.
ఎందుకంటారా? అయితే వినండి.తెలుగుదేశం లో చేరక ముందు కే.సీ.ఆర్ అంటే ఎవరో ఎవ్వరికీ తెలీదు.అన్నీ కుదిరాకేమో తెలంగాణా అంటూ ఒక పార్టీ పెట్టాడు,కొతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.సర్లే పార్టీ పెట్టాడు అతని కష్టాలు అతనివి అనుకుంటే, యం.పీ గా గెలిచాడు,మూన్నాల్లకే రాజినామా చేసాడు.మళ్ళీ సేం టు సేం రిపీట్ చేసాడు. మన రాష్ట్రంలో ఒక్క యం.పీ గెలవాలంటే నల్ల ధనం , తెల్ల ధనం అంతా కలిపి కనీసం పాతిక కోట్లు ఖర్చు." ఎవడబ్బా సొమ్మని లెక్క పత్రం లేక లక్షలు లక్షలు తింటివి రామాచంద్రా" అని రామదాసే రాముడిని అడగాడట.కానీ మన వెర్రి జనం మాత్రం తెలంగాణా తెస్తాడని గుద్దుతున్నారు ఓట్లు. వాడికేమో తినింది అరగక వాగుతున్నాడు. రీసెంట్ గా " జాగోరే తెలంగాణా, భాగోరే ఆంద్రావాలా" అంటూ విపరీత వాఖ్యలు చేసి నోటి దూల తీర్చుకున్నాడు.
అది చాలదన్నట్లు ఈ కోతికి కొబ్బరి చిప్ప పోయి కత్తి దొరికింది. " తెలంగాణా గన్ టీ.వి" పెడుతున్నాడంట. కంగారు పడకండి డబ్బులాడివి కాదు. డొనేషన్స్. నిన్నొక కామేంట్ చేసాడు" చిటికేస్తే కోట్లు కుమ్మరిస్తారు ఎన్నారైలు" అని.మరి ఈ కోతేం చేస్తుందో వేచి చూడాలి,లేదా కొబ్బరి చిప్ప లాక్కుని కోతుల్ని జూ లో పెట్టినట్లు ఈ దొరను యం.పీ గా దించేసి, రాజకీయాల్లొంచి తరిమేయ్యాలి. ష్........మెల్లగా చదవండి మళ్ళీ మనోడు విన్నాడాంటే " తెలంగాణా వారికి సపరేట్ బ్లాగులు, సపరేట్ ఇంటర్నేట్ (ఆంద్రావాళ్ళు యాక్సెస్ చెయ్యలేరు.ఓన్లీ ఫర్ టెలంగాణా) " అంటాడు..
గమనిక: ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.

రాజకీయాలు
Oct 22, 2009
అసెంబ్లీ కథ
అదొక విశాలమైన భవంతి. అందమైన గదులు, ఖరీదైన వస్తువులు, వేల మంది కష్టపడి పనిచేస్తే నిర్మించబడినది ఆ భవనం. అప్పటి హైదరాబాద్ కు నిజాం అయిన 6వ నిజాం మీర్ మహ్బూబ్ ఆలి ఖాన్ జ్ఞాపకార్థం ఆయన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటానికి ఉద్దేశించబడి, 1913వ సం" లో పూర్తిగా నిర్మించబడినది.అటుపైన హైదరాబాద్ టౌను హాలుగా కొనసాగేది. ఇదంతా 1905-1913 సం" ల మద్య జరిగిన కథ.తరువాత అనేకానేక మంది దేశ భక్తుల త్యాగ ఫలంగా మన దేశానికి స్వాతంత్ర్యం రావాటం జరిగింది.వారి చలువ వల్లనే మన దేశంలో ప్రజాస్వామ్యం పుట్టింది. తరువాతి కాలంలో ఇదే భవనం ఇప్పటి అసెంబ్లీ గా మార్చబడినది.
ఇంత వరకు కథ చాలా సుఖాంతంగా జరిగింది.అటుపైన మన రాజాకీయ నాయకులు అందులో అడుగు పెట్టారు.ఇక చూడండి నాసామిరంగా......
Labels:
రాజకీయాలు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి మనకు సంపాదించి పెట్టిన స్వాతంత్ర్యాన్ని గుర్తు తెచ్చుకుని సంతోషించాలో లేదా కొన్ని వందల దుర్మార్గుల చేతిలో దేశం నాశనం కావడం చూసి బాధ పడాలో తెలియక, జరిగే ప్రతిపనీ మన మంచి కోసమే అని ఆశపడుతూ నా బ్లాగ్ లోకపు మిత్రులకు మరియు ప్రతి భారతీయుడికి ఇవేనా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
Labels:
అంతర్మధనం
Jul 26, 2009
మాననవ గమనం ఎటువైపు???...
ఎందుకనే దానికి నా దగ్గర సమాధానం ఉంది. మరి సమాధానాలు చదివి అవునో కాదో మీరే ఆలోచించండి.అన్ని కలగలిపి కాకుండా నాకు అనిపించిన కొన్ని రంగాలలో ఉన్న పరిస్థితులు వివరిస్తాను.
మొదటగా విజ్ఞానం:నాకు ఉహా తెలిసే సమయానికి మా ఊర్లో ఒక్కటే స్కూలు ఉండేది. అది కూడా చిన్న పూరిగుడిసెలో.ఇప్పుడేమో వీధికొక్కటి ఉన్నాయి.కంప్యూటర్ అంటే అప్పుడొక విలాసవంతమైన మరియు అత్యంత ఖరీదైన వస్తువు.నేనైతే 2001వ సం" వరకు కంప్యూటర్ ను చూడనేలేదు.అలాంటిది ఇవాళ లాప్ టాప్,3జీ మొబైల్ ఇంకా బొలెడన్ని చూస్తున్నాం మరియు ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్ వాడుతున్నాం.అంతెందుకు సోది అనుకుంటే కంప్యూటర్ అనేది మన జీవితంలో ఇప్పుడొక భాగం. అది లేకుంటే మనకు ఒక్క రోజు కూడా ముందుకు సాగదు.
ఈ ప్రమాదాలన్నీ ఎలా జరిగాయి? ఎవరు చేసారని ఆరాతీస్తే మనకు తెలియవచ్చే విషయం" ఈ ఘటన ఫలానా తీవ్రవాద సమస్తకు చెందిన వారి పని. వారు ఉపయోగించిన ఈ అయుధాలు మరియు మందు సామాగ్రి అత్యంత శక్తివంతమైనవి. ఇందుకు అత్యంత నూతన టెక్నాలజీని వాడటం జరిగింది"అని.
ఇలాంటి విషయం వినగానే వళ్ళు జలదరిస్తుంది.భయంతో గొంతు ఎండిపోతుంది. కాదంటారా?

ఎందుకిలా? ఏమైంది మనకు??? మనం ఎలా పోతున్నాం??? మనలో మానవత్వం నశించి పోయిందా???వీటికి సమాధానం........????
ప్రసార మాద్యమాలు:ఇవి చాలవన్నట్టు మన మీడియా చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి.వింత పోకడలను అడుకోవటానికి బదులు కొత్తకొత్త ప్రోగ్రాములతో ఉన్న కాస్త మంచిని నాశనం చేస్తున్నాయి.ఏంట్రా వీడు అన్నీ అయిపోయాయని మీడియాపైన పడ్డాడనుకుంటున్నారా??? అక్కడకే వస్తున్నా..ఈ మద్య టీవీలలో వస్తున్న ప్రోగ్రాంస్ అలాగే ఉన్నాయి.మరి.స్టార్ టివిలో "సచ్ కా సామ్నా" అనే ఒక ప్రోగ్రాం వస్తుంది.అది ఎంత చెత్తగా ఉందంటే ప్రభుత్వాలు చట్టాలతో సమాజాన్ని నాశనం చేస్తుంటే మనం ఎందుకు ఊరికే ఉండాలి,మనం కూడా మన పని చేద్దాం అని మొదలెట్టారు దీనిని.ఈ ప్రోగ్రాంలో అడిగే ప్రశ్నలు ఎలాంటివో తెలుసా.
పెళ్ళికి ముందు మీకు అక్రమ సంబంధాలు ఎన్ని?
మీ బిడ్డకు తండ్రి మీ భర్తేనా?
పెళ్ళయ్యాక మీకు అవకాశం ఉంటే మీ భర్త ను మోసగించి అక్రమ సంబంధం పెట్టుకుంటారా?
సో అండ్ సో.. కుటుంబ సభ్యులు అందరి ముందర ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు.ఖర్మగాలి మనసులో ఎదైనా ఉంటే ఇట్టే బయట పడిపోతుంది. ఎందుకంటే ప్రశ్నలు అడిగే ముందర వారికి " నిజనిర్థారణ" పరీక్షలు జరుపుతారు.ఇలాంటి ప్రశ్నల వల్ల కాపురాలు కూలవా?? అంటే కూలిపోతాయ్.మరి ఎందుకిలాంటి ప్రోగ్రాంలు???వీటివల్ల సమాజానికి ఏదైనా లాభమా అంటే, అదీ లేదు.అలాకాకుండా సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాంలు చెయ్యొచ్చుకదా???విజ్ఞానానికి సంబందించిన మంచి విషయాలు,దేశంలో పెద్దలు మరియు అన్నింటి కంటే ముఖ్యం మన రాజకీయ నాయకులను గురించి ఇలాంటి ప్రోగ్రాములు చేస్తే బాగుంటుంది కదా!రాజకీయ నాయకులను ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి
మీరు నిజాయితీగా గెలిచారా?
మీరు ప్రజలకు ఎప్పుడైనా ద్రోహం చేసారా?
మీరు సంపాదించినదంతా నిజాయితీగా సంపాదించారా?
లాంటివి అడగొచ్చుకదా??? అడగరు...ఎందుకంటే అలాంటి మంచి పనులు చేస్తే వాళ్ళ చానల్ కు ఇబ్బంది.అందుకని ప్రజలను బకరాలను చేస్తున్నారు.ఇందులో మన(కొంత మంది ) తఫ్ఫు కూడా ఎంతో కొంత ఉంది.మన మానవత్వం లేని వింత చేష్ఠలను ఆసరాగా తీసుకుని వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాంస్ చేస్తున్నారు.
ఇది న్యాయమా?ఇలాంటి సమాజాన్ని చూస్తుంటే భయం వేయడం లేదా??ఇలాంటి అనేకానేక సంఘటనలు మానవ గమనాన్ని ఎటువైపు నడిపిస్తాయి????
మీకు తెలుసా?????? తెలిస్తే చెప్పండి. ప్లీస్....
గమనిక: ఈ పోస్ట్ ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు మరియు ఎవ్వరినీ నొప్పించేందుకు వ్రాయబడలేదు. కేవలం నా బుర్రలో ఉన్న సందేహాలకు అక్షర రూపం ఇవ్వటం జరిగింది.
ప్రసార మాద్యమాలు:ఇవి చాలవన్నట్టు మన మీడియా చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి.వింత పోకడలను అడుకోవటానికి బదులు కొత్తకొత్త ప్రోగ్రాములతో ఉన్న కాస్త మంచిని నాశనం చేస్తున్నాయి.ఏంట్రా వీడు అన్నీ అయిపోయాయని మీడియాపైన పడ్డాడనుకుంటున్నారా??? అక్కడకే వస్తున్నా..ఈ మద్య టీవీలలో వస్తున్న ప్రోగ్రాంస్ అలాగే ఉన్నాయి.మరి.స్టార్ టివిలో "సచ్ కా సామ్నా" అనే ఒక ప్రోగ్రాం వస్తుంది.అది ఎంత చెత్తగా ఉందంటే ప్రభుత్వాలు చట్టాలతో సమాజాన్ని నాశనం చేస్తుంటే మనం ఎందుకు ఊరికే ఉండాలి,మనం కూడా మన పని చేద్దాం అని మొదలెట్టారు దీనిని.ఈ ప్రోగ్రాంలో అడిగే ప్రశ్నలు ఎలాంటివో తెలుసా.
పెళ్ళికి ముందు మీకు అక్రమ సంబంధాలు ఎన్ని?
మీ బిడ్డకు తండ్రి మీ భర్తేనా?
పెళ్ళయ్యాక మీకు అవకాశం ఉంటే మీ భర్త ను మోసగించి అక్రమ సంబంధం పెట్టుకుంటారా?
మీరు ప్రజలకు ఎప్పుడైనా ద్రోహం చేసారా?
మీరు సంపాదించినదంతా నిజాయితీగా సంపాదించారా?
లాంటివి అడగొచ్చుకదా??? అడగరు...ఎందుకంటే అలాంటి మంచి పనులు చేస్తే వాళ్ళ చానల్ కు ఇబ్బంది.అందుకని ప్రజలను బకరాలను చేస్తున్నారు.ఇందులో మన(కొంత మంది ) తఫ్ఫు కూడా ఎంతో కొంత ఉంది.మన మానవత్వం లేని వింత చేష్ఠలను ఆసరాగా తీసుకుని వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాంస్ చేస్తున్నారు.
ఇది న్యాయమా?ఇలాంటి సమాజాన్ని చూస్తుంటే భయం వేయడం లేదా??ఇలాంటి అనేకానేక సంఘటనలు మానవ గమనాన్ని ఎటువైపు నడిపిస్తాయి????
మీకు తెలుసా?????? తెలిస్తే చెప్పండి. ప్లీస్....
గమనిక: ఈ పోస్ట్ ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు మరియు ఎవ్వరినీ నొప్పించేందుకు వ్రాయబడలేదు. కేవలం నా బుర్రలో ఉన్న సందేహాలకు అక్షర రూపం ఇవ్వటం జరిగింది.
Labels:
అంతర్మధనం
Jun 28, 2009
ఫ్యాక్స్ మెషిన్+ఫోన్ లైన్=ఫ్యాక్స్=కంప్యూటర్+ఫోన్ లైన్
మనం ఎవరికైనా ఫ్యాక్స్ పంపించాలన్నా లేక రీసీవ్ చేసుకోవాలన్నా " ఫోన్ లైన్ మరియు ఫ్యాక్స్ మెషిన్ " తప్పకుండా అవసరం అవుతాయి. ఒకవేళ ఫ్యాక్స్ మెషిన్ లో కాట్రేజ్ అయిపోతే, దానికి మళ్ళీ కాట్రేజ్ కొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్యాక్స్ మెషిన్ మరియు కాట్రేజ్ ల గొడవ లేకుండా కంప్యుటర్ ద్వారా ఫ్యాక్స్ పంపించే / రీసీవ్ చేసుకునే వీలుంటే, అన్ని సెండ్/రిసీవ్ ఫ్యాక్స్ లను సేవ్ చేసుకుని, అవసరమైన వాటిని మాత్రమె ప్రింట్ తీసుకునే వీలుంటే???ప్రతీ ఫ్యాక్స్ ను ప్రింట్ తీయటం మరియు కాట్రేజ్ లు కొనడం లాంటి బాధలు తప్పుతాయి. మరి అలాంటి వెసులుబాటు ఉందా????? ఖచ్చితంగా ఉంది. మరి అదెలాగో తెలుసుకుందామా??? పందండి...
***ఇందుకోసం మనకు ఒక ఫోన్ లైన్ మరియు ఒక కంప్యూటర్ అవసరం అవుతాయి.***
గమనిక: మీరు ఫ్యాక్స్ పంపాలనుకునే డాక్యుమెంట్ పేపర్ పైన ఉంటే దానిని స్కాన్ చేసి, ఫ్యాక్స్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఆ డాక్యుమెంట్ కంప్యూటర్ లోనే ఉంటే సమస్యే లేదు.
1: ముందుగా మీ కంప్యూటర్ మోడం ను ఫోన్ లైన్ కు క్రింది చిత్రంలో చూపిన విధంగా కలపండి.
3.ఆపై స్టార్ట్ మెను ద్వారా కంట్రోల్ ప్యానాల్ లోకి వెళ్ళండి.
4.యాడ్ /రిమూవ్ ప్రోగ్రాంస్ ను నొక్కండి. ఇప్పుడు ఒక క్రొత్త విండో ఓపెన్ అవుతుంది.
5. ఇప్పుడు పటంలో చూపిన విధంగా " యాడ్ /రిమూవ్ విండోస్ కాంపోనెంట్" ను నొక్కండి. అలా నోక్కగానే వేరొక విండో ఓపెన్ అవుతుంది.
6. ఆ క్రొత్త విండోలో "ఫ్యాక్స్ సర్వీసెస్" అనే ఆప్సన్ కు టిక్కు పెట్టి, "నెక్స్ట్" ను నొక్కండీ.ఒకవేళ ముందుగానే టిక్కు ఉంటే " క్యాన్సల్" నొక్కండి.
7. ఇప్పుడు సెటప్ ఇన్ స్టాల్ అయ్యి " విండోస్ ఎక్స్పి సీడీని" అడుగుతుంది.సీడీని ఉంచి ఓకే నొక్కండి.
8. చివరగా "ఫినిష్" నొక్కి అన్ని విండోస్ ను మూసేయండి. ఇప్పటికి ఫాక్స్ సర్వీస్ మీ కంప్యూటర్లో ఇన్ స్టాల్ అయ్యింది.
***ఇప్పుడు ఫ్యాక్స్ ను కాన్ ఫిగర్ చేసుకుని ఫ్యాక్స్ పంపటం/ రిసీవ్ చేసుకోవటం ఎలాగో తెలుసుకుందాం. ***
ఫ్యాక్స్ సర్వీస్ ను కాన్ ఫిగర్ చేయుట
విండోస్ లో ఫ్యాక్స్ సర్వీస్ ను కాన్ ఫిగర్ చేయుటకు:
1. స్టార్ట్--->ఆల్ ప్రోగ్రాంస్--->యాక్సెసరీస్--->కమ్యునికేషన్--->ఫ్యాక్స్---.ఫ్యాక్స్ కన్సోల్ ను క్లిక్ చేయండి.
3. సెండర్ ఇంఫర్మేషన్ పేజ్ లో మీ వివరాలను వ్రాయండి. ( కేవలం పేరు మరియు మీ ఫ్యాక్స్ నంబర్ వ్రాస్తే సరిపోతుంది. మిగిలినవి కూడా వ్రాయవచ్చును. ఇక్కడ మీరు అందించే వివరాలు మీ ఫ్యాక్స్ రిసీవ్ చేసుకునే వారికి ఫ్యాక్స్ తో పాటూ పంపబడతాయి). ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.
5. ఇప్పుడు కనిపించే ట్రాస్ మిటింగ్ సబ్ స్చ్రైబర్ ఐడెంటిఫికేషన్ పేజ్ లో మీరు TSID బాక్స్ లో కనిపించాలనుకుంటున్న పేరు /మీ ఫ్యాక్స్ నంబరు/ పేరు-మీ ఫ్యాక్స్ నంబరు లలో ఏదో ఒకటి వ్రాయండి. ఇక్కడ ఏ సమాచారం ఇచ్చినా ఇబ్బంది లేదు.ఎందుకంటే మనకు దీని అవసరం పెద్దగా ఉండదు.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.
6. ఇప్పుడు కనిపించే కాల్డ్ సబ్ స్చ్రైబర్ ఐడెంటిఫికేషన్ పేజ్ లో కూడా 5 వ స్టెప్ లో లాగే సమాచారాం ఇవ్వండి. TSID మరియు CSID లు దాదాపు ఒకటే.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.
7. ఇప్పుడు రౌటింగ్ ఆప్షన్ లలో క్రింది చిత్రం లో విధంగా ప్రింట్ ఇట్ ఆన్ కు టిక్కు ఫెట్టండి(ఇందు వల్ల మీరు రిసీవ్ చేసుకున్న ఫ్యాక్స్ లను ఆటోమాటిక్ గా ప్రింట్ చేసుకో వచ్చు).ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకున్న అన్ని ఫ్యాక్స్ లను మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకోవాలంటే స్టోర్ ఎ కాపి కి టిక్కు ఉంచి మీరు ఫ్యాక్స్ లను సేవ్ చేయాలనుకునే ఫోల్డర్ను బ్రౌస్ ఆప్షన్ ద్వారా ఎన్నుకోండి.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.
8.ఇప్పుడు వచ్చిన విండో లో ఫినిష్ క్లిక్ చేయండి.
9. ఇప్పుడు వచ్చే విండోస్ సెక్యూరిటి అలెర్ట్ ను అన్ బ్లాక్ చేయండి.అంతే మీ ఫ్యాక్స్ మెషిన్ కాంఫిగర్ అయిపోయింది.
Labels:
కంప్యూటర్ సమాచారం
Jun 23, 2009
రాడార్ మరియూ అది పనిచేసే విదానము.
"రాడార్" ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న పదం ఇది. మరి "రాడార్" అంటే ఏమిటి, దానిని కనుగొన్నదెవరు, అది ఏలా పనిచేస్తుంది అనే విషయాలు మనలో కొందరికే తెలుసు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన కంటికి కనపడనంత దూరంగా వుండే వస్తువులు, ఇంకా విమానాలు వంటి వాహనాలు ఒక ప్రదేశం నుంచి సరిగ్గా ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగించే సాధనాన్నే మనం "రాడార్" అని అంటున్నాం. "రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్" అనే మాటకు సంక్షిష్టమైన రూపం ఇది. రాడార్లను ఉపయోగించి వివిధ వస్తువులు ఎంత దూరంలో ఉన్నాయి అన్న దానినే గాక తుఫానులు, ఉప్పెనలు వంటి ప్రకృతి వైపరీత్యాల ఉనికి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. 
ఈ రాడార్ ను 1904 వ సంవత్సరము నుండి"Christian Hulsmeyer , Nikola Tesla, Emile Girardeau, Dr. Robert M. Page , P.K. Oshchepkov" వంటి అనేకమంది శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల ఫలితంగా మొట్టమొదటిసారిగా 1934 లో " Leningrad Electrophysical Institute" అనే మిలటరీ సమస్థ " ర్యాపిడ్" అనే వ్యవస్థ ద్వారా 3 కిలోమిటర్ల పరిధిలో తిరుగుతున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ కదలికలను గుర్తించా.దాని తరువత జరిగిన ప్రయోగాల ఫలితంగా 1936 వ సం' లో "Zoltan Bay" అనే హంగేరియన్ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పూర్తి స్తాయి పనితనం గల RADAR వ్యవస్థను కనుగొన్నారు.
సముద్రాలలో ఒక ప్రదేశం దగ్గర ఎంత లోతుగా వుందో తెలుసుకొనేందుకై ఏ పద్ధతిని ఉపయోగిస్తారో మీకు తెలిసిందే కదా. లోతు తెలుసుకోదలచిన ప్రదేశంలో సముద్రపు ఉపరితలం నుంచి ఒక రకమైన శబ్ద తరంగాలను సముద్రగర్భంలోకి పంపిస్తారు. ఆ శబ్ద తరంగాలు సముద్రపు అడుగు భాగాన్ని తాకి పరావర్తనం చెంది, తిరిగి శబ్ద జనకాన్ని చేరుతాయి. 
ఇలా ఆ తరంగాలు సముద్రపు అడుగు బాగాన్ని తాకి, తిరిగి దానిని చేరుకునేందుకు పట్టే సమయాన్ని బట్టి ఒక ప్రదేశం దగ్గర సముద్రం ఎంత లోతుగా వుందో తెలుసుకుంటారు. సరిగ్గా ఈ రకమైన టెక్నాలజీనే రాడార్ల లోనూ ఉపయోగిస్తారు. అయితే రాడార్లలో శబ్ద తరంగాలకు బదులుగా చాలా వేగంగా ప్రయాణించే 'మైక్రో వేవ్స్' (సూక్ష్మ తరంగాలు) అనే విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగిస్తారు.
ఈ సూక్ష్మ తరంగాలు కాంతి వేగంతో అంటే సెకనుకు 3,00,000 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తాయి. రాడారు కేంద్రంలో వుండే ట్రాన్స్మిటర్లు, యాంటెన్నాలు వంటి పరికరాల సాయంతో సూక్ష్మ తరంగాలను అన్ని దిశలకూ ప్రసారం చేస్తాయి. ఈ రేడియో తరంగాలు వేర్వేరు వస్తువులను తాకి పరావర్తనం చెంది, తిరిగి రాడారు కేంద్రాన్ని చేరుకుంటాయి.
ఈ తరంగాలు రాడారు కేంద్రం నుంచి బయలుదేరి తిరిగి దానిని చేరుకునేందుకు ఎంత సమయం పట్టింది అనే దానిని, ఇంకా కాంతి వేగాన్ని ఆధారంగా చేసుకుని ఒక వస్తువు గాని, విమానంగాని, లేదా ఏదైనా ఖగోళ పదార్థంగాని ఒక ప్రదేశం నుంచి సరిగ్గా ఎంత దూరంలో వుందో కచ్చితంగా చెప్పగలుగుతారు.
కేవలం ఇలా దూరాలను తెలుసుకునేందుకేగాక, అంతరిక్ష నౌకలకు సందేశాలను పంపేందుకు కూడా నేడు రాడార్లను విరివిగా వాడుతున్నారు.
Labels:
విజ్ఞానశాస్త్రం
Jun 21, 2009
నోకియా మొబైల్ మాక్ అడ్రస్(Find Nokia Mobile's MAC Address)
ప్రస్తుతం వస్తున్న నోకియ మోడల్స్ లో ఇంటెర్నెట్ మరియు W-LAN సర్వ సాధారణంగా వస్తున్న ఫీచర్.ఈ ఫిచర్ ను కేబుల్ / బ్లూటూత్/ ఇన్ ఫ్రారెడ్ / wi-fi ద్వారా ఉపయోగిస్తుంటారు.ఇక్కడ మనం తెలుకోబోయేది "ఒకవేళ WI-FI లో ఏదైనా సమస్య వచ్చి Auto Search ద్వారా ఇంటెర్నెట్/WLAN connect కాకపోతే???ఏంటి పరిస్థితి???" ఒకసారి నాకు ఇలానే ఇబ్బంది వచ్చేసరికి ,పిచ్చెక్కియినంత పనైపొయింది..కొత్తగా మొబైల్ కొన్నాను,ఇంటెర్నెట్ పని చేయటం లేదు...ఏం చేయలో అర్థం కాక బాగా ఆలోచించాను.మొబైల్ ఒక్కసారి కొన్నాక వాపస్ ఇచ్చే ప్రసక్తే లేదు.ఇప్పుడెలా??మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్...........
సరే ఉండనే ఉందిగా మన గూగుల్ అని నా సమస్యకు పరిస్కారమా ఏక్కడున్నావ్ అంటు దేవులాడటం ప్రారంభించాను.అప్పుడే తట్టింది నా బుర్రకి ఒక ఆలోచన.అదేంటంటే "కంప్యూటర్ ను మాక్ అడ్రెస్ ద్వారా WLAN కు అనుసంధానించినప్పుడు, ఇంటెర్నెట్ ఫీచర్ ఉన్న మొబైల్ ను ఎందుకు ట్రై చేయకూదదని?"(ఆ ఆలోచన వచ్చేవరకు మొబైల్ కు మాక్ అడ్రెస్ ఉంటుందని నాకు తెలియదు)...అలా వెదికి వెదికి చివరకు క్రింది కోడ్ ను చూసాను.

*#62209526#
ఇంకేముంది?అలా కనుక్కొన్న మాక్ అడ్రస్ ద్వారా నా మొబైల్ యొక్క మాక్ అడ్రెస్ ను కనుక్కుని,దాని ద్వారా ఇంటెర్నెట్ ను కనెక్ట్ చేసుకున్నాను.ఇప్పుడు ఆఫీస్ లో ఖాళీ గా ఉన్న సమయాలలో నా మొబైల్ లోకి ఇంటెర్నెట్ ద్వారా కావలసిన సమాచారాన్ని దిగుమతి చేసుకుంటున్నాను.
Labels:
మొబైల్ ప్రపంచం