Showing posts with label కంప్యూటర్ సమాచారం. Show all posts
Showing posts with label కంప్యూటర్ సమాచారం. Show all posts

Jun 28, 2009

ఫ్యాక్స్ మెషిన్+ఫోన్ లైన్=ఫ్యాక్స్=కంప్యూటర్+ఫోన్ లైన్


మనం
ఎవరికైనా ఫ్యాక్స్ పంపించాలన్నా లేక రీసీవ్ చేసుకోవాలన్నా " ఫోన్ లైన్ మరియు ఫ్యాక్స్ మెషిన్ " తప్పకుండా అవసరం అవుతాయి. ఒకవేళ ఫ్యాక్స్ మెషిన్ లో కాట్రేజ్ అయిపోతే, దానికి మళ్ళీ కాట్రేజ్ కొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యాక్స్ మెషిన్ మరియు కాట్రేజ్ గొడవ లేకుండా కంప్యుటర్ ద్వారా ఫ్యాక్స్ పంపించే / రీసీవ్ చేసుకునే వీలుంటే, అన్ని సెండ్/రిసీవ్ ఫ్యాక్స్ లను సేవ్ చేసుకుని, అవసరమైన వాటిని మాత్రమె ప్రింట్ తీసుకునే వీలుంటే???ప్రతీ ఫ్యాక్స్ ను ప్రింట్ తీయటం మరియు కాట్రేజ్ లు కొనడం లాంటి బాధలు తప్పుతాయి. మరి అలాంటి వెసులుబాటు ఉందా????? ఖచ్చితంగా ఉంది. మరి అదెలాగో తెలుసుకుందామా??? పందండి...




***ఇందుకోసం మనకు ఒక ఫోన్ లైన్ మరియు ఒక కంప్యూటర్ అవసరం అవుతాయి.***


గమనిక: మీరు ఫ్యాక్స్ పంపాలనుకునే డాక్యుమెంట్ పేపర్ పైన ఉంటే దానిని స్కాన్ చేసి, ఫ్యాక్స్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ డాక్యుమెంట్ కంప్యూటర్ లోనే ఉంటే సమస్యే లేదు.


1: ముందుగా మీ కంప్యూటర్ మోడం ను ఫోన్ లైన్ కు క్రింది చిత్రంలో చూపిన విధంగా కలపండి.



2. తరువాత మీ కంప్యూటర్ లోకి అడ్మిన్ లాగా లాగ్ ఇన్ అవ్వండీ.
3.ఆపై స్టార్ట్ మెను ద్వారా కంట్రోల్ ప్యానాల్ లోకి వెళ్ళండి.

4.యాడ్ /రిమూవ్ ప్రోగ్రాంస్ ను నొక్కండి. ఇప్పుడు ఒక క్రొత్త విండో ఓపెన్ అవుతుంది.

5. ఇప్పుడు పటంలో చూపిన విధంగా " యాడ్ /రిమూవ్ విండోస్ కాంపోనెంట్" ను నొక్కండి. అలా నోక్కగానే వేరొక విండో ఓపెన్ అవుతుంది.

6. క్రొత్త విండోలో "ఫ్యాక్స్ సర్వీసెస్" అనే ఆప్సన్ కు టిక్కు పెట్టి, "నెక్స్ట్" ను నొక్కండీ.ఒకవేళ ముందుగానే టిక్కు ఉంటే " క్యాన్సల్" నొక్కండి.





7. ఇప్పుడు సెటప్ ఇన్ స్టాల్ అయ్యి " విండోస్ ఎక్స్పి సీడీని" అడుగుతుంది.సీడీని ఉంచి ఓకే నొక్కండి.
8. చివరగా "ఫినిష్" నొక్కి అన్ని విండోస్ ను మూసేయండి. ఇప్పటికి ఫాక్స్ సర్వీస్ మీ కంప్యూటర్లో ఇన్ స్టాల్ అయ్యింది.


***ఇప్పుడు ఫ్యాక్స్ ను కాన్ ఫిగర్ చేసుకుని ఫ్యాక్స్ పంపటం/ రిసీవ్ చేసుకోవటం ఎలాగో తెలుసుకుందాం. ***


ఫ్యాక్స్ సర్వీస్ ను కాన్ ఫిగర్ చేయుట


విండోస్ లో ఫ్యాక్స్ సర్వీస్ ను కాన్ ఫిగర్ చేయుటకు:

1. స్టార్ట్--->ఆల్ ప్రోగ్రాంస్--->యాక్సెసరీస్--->కమ్యునికేషన్--->ఫ్యాక్స్---.ఫ్యాక్స్ కన్సోల్ ను క్లిక్ చేయండి.





2. ఫ్యాక్స్ కాంఫిగరేషన్ విజార్డ్ మొదలవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ను క్లిక్ చేయండి.



3. సెండర్ ఇంఫర్మేషన్ పేజ్ లో మీ వివరాలను వ్రాయండి. ( కేవలం పేరు మరియు మీ ఫ్యాక్స్ నంబర్ వ్రాస్తే సరిపోతుంది. మిగిలినవి కూడా వ్రాయవచ్చును. ఇక్కడ మీరు అందించే వివరాలు మీ ఫ్యాక్స్ రిసీవ్ చేసుకునే వారికి ఫ్యాక్స్ తో పాటూ పంపబడతాయి). ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.





4.ఇప్పుడు కనిపించే విండో లో ఫ్యాక్స్ మెషిన్ ను సెలెక్ట్ చేసుకోండి(ఇది డీఫాల్ట్ గా సెలెక్ట్ చేయబడుతుంది.). ఇప్పుడు క్రింద చిత్రంలో చూపిన విధంగా సెండ్ మరియు రిసీవ్ ఆప్సన్ లను ఏనేబుల్ చేయండి.( రిసీవ్ ఫ్యాక్స్ ను ఆటోమాటిక్ ఆన్సర్ లో ఉంచుకుంటే సౌకర్యంగా ఉంటుంది).ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.





5. ఇప్పుడు కనిపించే ట్రాస్ మిటింగ్ సబ్ స్చ్రైబర్ ఐడెంటిఫికేషన్ పేజ్ లో మీరు TSID బాక్స్ లో కనిపించాలనుకుంటున్న పేరు /మీ ఫ్యాక్స్ నంబరు/ పేరు-మీ ఫ్యాక్స్ నంబరు లలో ఏదో ఒకటి వ్రాయండి. ఇక్కడ ఏ సమాచారం ఇచ్చినా ఇబ్బంది లేదు.ఎందుకంటే మనకు దీని అవసరం పెద్దగా ఉండదు.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.





6. ఇప్పుడు కనిపించే కాల్డ్ సబ్ స్చ్రైబర్ ఐడెంటిఫికేషన్ పేజ్ లో కూడా 5 వ స్టెప్ లో లాగే సమాచారాం ఇవ్వండి. TSID మరియు CSID లు దాదాపు ఒకటే.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.



7. ఇప్పుడు రౌటింగ్ ఆప్షన్ లలో క్రింది చిత్రం లో విధంగా ప్రింట్ ఇట్ ఆన్ కు టిక్కు ఫెట్టండి(ఇందు వల్ల మీరు రిసీవ్ చేసుకున్న ఫ్యాక్స్ లను ఆటోమాటిక్ గా ప్రింట్ చేసుకో వచ్చు).ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకున్న అన్ని ఫ్యాక్స్ లను మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకోవాలంటే స్టోర్ ఎ కాపి కి టిక్కు ఉంచి మీరు ఫ్యాక్స్ లను సేవ్ చేయాలనుకునే ఫోల్డర్ను బ్రౌస్ ఆప్షన్ ద్వారా ఎన్నుకోండి.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.





8.ఇప్పుడు వచ్చిన విండో లో ఫినిష్ క్లిక్ చేయండి.





9. ఇప్పుడు వచ్చే విండోస్ సెక్యూరిటి అలెర్ట్ ను అన్ బ్లాక్ చేయండి.అంతే మీ ఫ్యాక్స్ మెషిన్ కాంఫిగర్ అయిపోయింది.