Jul 26, 2009

మాననవ గమనం ఎటువైపు???...

మనం ఎటు పోతున్నామో మీకు తెలుసా?? కనీసం దాని గురించి ఎప్పుడైనా అలోచించారా??మానవ మనుగడ పురోగమనంగా వుందా లేక తిరోగమనమా??ఒక్కసారి మన చుట్టూ జరుగుతున్న విషయాలను తలుచుకుంటే భయమేస్తుంది.ఎందుకంటారా?? కాదంటారా???

ఎందుకనే దానికి నా దగ్గర సమాధానం ఉంది. మరి సమాధానాలు చదివి అవునో కాదో మీరే ఆలోచించండి.అన్ని కలగలిపి కాకుండా నాకు అనిపించిన కొన్ని రంగాలలో ఉన్న పరిస్థితులు వివరిస్తాను
.

మొదటగా విజ్ఞానం:నాకు ఉహా తెలిసే సమయానికి మా ఊర్లో ఒక్కటే స్కూలు ఉండేది. అది కూడా చిన్న పూరిగుడిసెలో.ఇప్పుడేమో వీధికొక్కటి ఉన్నాయి.కంప్యూటర్ అంటే అప్పుడొక విలాసవంతమైన మరియు అత్యంత ఖరీదైన వస్తువు.నేనైతే 2001వ సం" వరకు కంప్యూటర్ ను చూడనేలేదు.అలాంటిది ఇవాళ లాప్ టాప్,3జీ మొబైల్ ఇంకా బొలెడన్ని చూస్తున్నాం మరియు ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్ వాడుతున్నాం.అంతెందుకు సోది అనుకుంటే కంప్యూటర్ అనేది మన జీవితంలో ఇప్పుడొక భాగం. అది లేకుంటే మనకు ఒక్క రోజు కూడా ముందుకు సాగదు
.

ఎన్నో అద్భుతాలను మనిషి కనుక్కోవడం మరియు ఉన్నవాటిని మరింత అభివృధిపరుస్తుంటే ఏదో తెలియని ఆనందం.అలా అనందగా అందమైన లోకాన్ని తలుచుకుంటూ ఉండగానే "మీరు ఆనందంగా ఉంటే నేను చూడగలనా?" అంటూ దేవుడు వెంటనే ఒక ఫ్లాస్ న్యూస్ ను మన చెవులకు చేరవేస్తాడు."ఫలానా దేశంలో బాంబులు , విమానాలు కూలి పోయ్యాయనో,ఇలా...
ఈ ప్రమాదాలన్నీ ఎలా జరిగాయి? ఎవరు చేసారని ఆరాతీస్తే మనకు తెలియవచ్చే విషయం" ఈ ఘటన ఫలానా తీవ్రవాద సమస్తకు చెందిన వారి పని. వారు ఉపయోగించిన ఈ అయుధాలు మరియు మందు సామాగ్రి అత్యంత శక్తివంతమైనవి. ఇందుకు అత్యంత నూతన టెక్నాలజీని వాడటం జరిగింది"అని
.

ఇలాంటి విషయం వినగానే వళ్ళు జలదరిస్తుంది.భయంతో గొంతు ఎండిపోతుంది.
కాదంటారా?

ఇక మానవత్వం:అంటే ఏమిటీ అని అడిగే రోజులొచేసాయ్ ఇప్పుడు.కారణాలు ఎన్నో. స్వార్థం కావచ్చు,ఉన్మాదం కావచ్చు,అసూయ కావచ్చు, మరేదైనా కావచ్చు. పల్లూడగొట్టుకోవటానికి ఏ రాయి అయితే ఏంటంటరా? కరెక్టే.ఒకప్పుడు పర స్త్రీ తల్లితో సమానం, పరుల సొమ్ము పాము వంటిది అంటూ బళ్ళో పాఠాలు చేప్పేవారు మన అయ్యవారులు.విన్న వాళ్ళు కూడా అలాగే అనుకునే వారు.కనుకనే ఏ వ్యవస్థ సరిగా లేనప్పుడే మన ప్రపంచంలో నేరాలు తక్కువగా ఉండేవి.మరిప్పుడో... అద్యాపకులే అమ్మాయి(ఆబ్బాయి) లకు ప్రేమ పాఠలు చెపుతున్నారు. దాంతో మన స్టూడెంట్స్ మేమేం తక్కువా? అన్నట్లు లవ్వులు,వొప్పుకోకుంటే వార్నింగులు,రేపులు,యాసిడ్ తో దాడులు మరియు మర్డర్లు చేసుకుంటూ పోతున్నారు.చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం ఏం చేస్తుందంటారా??పోలిసులకు పని తక్కువైంది,ఉన్న నేరాలు సరిపోవటం లేదని కొత్త చట్టాలు తీసుకొస్తుంది.

అవి ఎలాంటివంటే "ప్రకృతి విరుద్దమైనవి".అమ్మాయిలు అబ్బాయిల పైన లేక అబ్బాయిలు అమ్మాయిల పైన దాడి చేస్తే ఏముంటుంది మజా? అమ్మాయిలు అమ్మాయిలపైన, అబ్బాయిలు అబ్బాయిలపైన దాడి చేస్తే కదా అసలైన కిక్కు అనుకుందో ఏమో సెక్సన్ 377 అమలుకై అనేక విధాలుగా ప్రయత్నిస్తుంది.ఈ చట్టం అమలైందో మన భారత దేశం పరువు చిత్తు కాగితంలా ఎగిరి పోతుంది."అర్ధరాత్రి ఆడది వంటరిగా తిరగ గలిగినప్పుడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు" అన్న గాందీజీ కలలు దేవుడెరుగు " పగలే రోడ్డుపైన తిరగలేరు ఆడ,మగ ఇద్దరూనూ ".

ఎందుకిలా? ఏమైంది మనకు??? మనం ఎలా పోతున్నాం??? మనలో మానవత్వం నశించి పోయిందా???వీటికి సమాధానం........????

ప్రసార మాద్యమాలు:ఇవి చాలవన్నట్టు మన మీడియా చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి.వింత పోకడలను అడుకోవటానికి బదులు కొత్తకొత్త ప్రోగ్రాములతో ఉన్న కాస్త మంచిని నాశనం చేస్తున్నాయి.ఏంట్రా వీడు అన్నీ అయిపోయాయని మీడియాపైన పడ్డాడనుకుంటున్నారా??? అక్కడకే వస్తున్నా..ఈ మద్య టీవీలలో వస్తున్న ప్రోగ్రాంస్ అలాగే ఉన్నాయి.మరి.స్టార్ టివిలో "సచ్ కా సామ్నా" అనే ఒక ప్రోగ్రాం వస్తుంది.అది ఎంత చెత్తగా ఉందంటే ప్రభుత్వాలు చట్టాలతో సమాజాన్ని నాశనం చేస్తుంటే మనం ఎందుకు ఊరికే ఉండాలి,మనం కూడా మన పని చేద్దాం అని మొదలెట్టారు దీనిని.ఈ ప్రోగ్రాంలో అడిగే ప్రశ్నలు ఎలాంటివో తెలుసా.
పెళ్ళికి ముందు మీకు అక్రమ సంబంధాలు ఎన్ని?
మీ బిడ్డకు తండ్రి మీ భర్తేనా?
పెళ్ళయ్యాక మీకు అవకాశం ఉంటే మీ భర్త ను మోసగించి అక్రమ సంబంధం పెట్టుకుంటారా?

సో అండ్ సో.. కుటుంబ సభ్యులు అందరి ముందర ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు.ఖర్మగాలి మనసులో ఎదైనా ఉంటే ఇట్టే బయట పడిపోతుంది. ఎందుకంటే ప్రశ్నలు అడిగే ముందర వారికి " నిజనిర్థారణ" పరీక్షలు జరుపుతారు.ఇలాంటి ప్రశ్నల వల్ల కాపురాలు కూలవా?? అంటే కూలిపోతాయ్.మరి ఎందుకిలాంటి ప్రోగ్రాంలు???వీటివల్ల సమాజానికి ఏదైనా లాభమా అంటే, అదీ లేదు.అలాకాకుండా సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాంలు చెయ్యొచ్చుకదా???విజ్ఞానానికి సంబందించిన మంచి విషయాలు,దేశంలో పెద్దలు మరియు అన్నింటి కంటే ముఖ్యం మన రాజకీయ నాయకులను గురించి ఇలాంటి ప్రోగ్రాములు చేస్తే బాగుంటుంది కదా!రాజకీయ నాయకులను ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి

మీరు నిజాయితీగా గెలిచారా?
మీరు ప్రజలకు ఎప్పుడైనా ద్రోహం చేసారా?
మీరు సంపాదించినదంతా నిజాయితీగా సంపాదించారా?

లాంటివి అడగొచ్చుకదా??? అడగరు...ఎందుకంటే అలాంటి మంచి పనులు చేస్తే వాళ్ళ చానల్ కు ఇబ్బంది.అందుకని ప్రజలను బకరాలను చేస్తున్నారు.ఇందులో మన(కొంత మంది ) తఫ్ఫు కూడా ఎంతో కొంత ఉంది.మన మానవత్వం లేని వింత చేష్ఠలను ఆసరాగా తీసుకుని వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాంస్ చేస్తున్నారు.

ఇది న్యాయమా?ఇలాంటి సమాజాన్ని చూస్తుంటే భయం వేయడం లేదా??ఇలాంటి అనేకానేక సంఘటనలు మానవ గమనాన్ని ఎటువైపు నడిపిస్తాయి????

మీకు తెలుసా?????? తెలిస్తే చెప్పండి. ప్లీస్....

గమనిక: ఈ పోస్ట్ ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు మరియు ఎవ్వరినీ నొప్పించేందుకు వ్రాయబడలేదు. కేవలం నా బుర్రలో ఉన్న సందేహాలకు అక్షర రూపం ఇవ్వటం జరిగింది.