Jun 28, 2009

ఫ్యాక్స్ మెషిన్+ఫోన్ లైన్=ఫ్యాక్స్=కంప్యూటర్+ఫోన్ లైన్


మనం
ఎవరికైనా ఫ్యాక్స్ పంపించాలన్నా లేక రీసీవ్ చేసుకోవాలన్నా " ఫోన్ లైన్ మరియు ఫ్యాక్స్ మెషిన్ " తప్పకుండా అవసరం అవుతాయి. ఒకవేళ ఫ్యాక్స్ మెషిన్ లో కాట్రేజ్ అయిపోతే, దానికి మళ్ళీ కాట్రేజ్ కొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యాక్స్ మెషిన్ మరియు కాట్రేజ్ గొడవ లేకుండా కంప్యుటర్ ద్వారా ఫ్యాక్స్ పంపించే / రీసీవ్ చేసుకునే వీలుంటే, అన్ని సెండ్/రిసీవ్ ఫ్యాక్స్ లను సేవ్ చేసుకుని, అవసరమైన వాటిని మాత్రమె ప్రింట్ తీసుకునే వీలుంటే???ప్రతీ ఫ్యాక్స్ ను ప్రింట్ తీయటం మరియు కాట్రేజ్ లు కొనడం లాంటి బాధలు తప్పుతాయి. మరి అలాంటి వెసులుబాటు ఉందా????? ఖచ్చితంగా ఉంది. మరి అదెలాగో తెలుసుకుందామా??? పందండి...




***ఇందుకోసం మనకు ఒక ఫోన్ లైన్ మరియు ఒక కంప్యూటర్ అవసరం అవుతాయి.***


గమనిక: మీరు ఫ్యాక్స్ పంపాలనుకునే డాక్యుమెంట్ పేపర్ పైన ఉంటే దానిని స్కాన్ చేసి, ఫ్యాక్స్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ డాక్యుమెంట్ కంప్యూటర్ లోనే ఉంటే సమస్యే లేదు.


1: ముందుగా మీ కంప్యూటర్ మోడం ను ఫోన్ లైన్ కు క్రింది చిత్రంలో చూపిన విధంగా కలపండి.



2. తరువాత మీ కంప్యూటర్ లోకి అడ్మిన్ లాగా లాగ్ ఇన్ అవ్వండీ.
3.ఆపై స్టార్ట్ మెను ద్వారా కంట్రోల్ ప్యానాల్ లోకి వెళ్ళండి.

4.యాడ్ /రిమూవ్ ప్రోగ్రాంస్ ను నొక్కండి. ఇప్పుడు ఒక క్రొత్త విండో ఓపెన్ అవుతుంది.

5. ఇప్పుడు పటంలో చూపిన విధంగా " యాడ్ /రిమూవ్ విండోస్ కాంపోనెంట్" ను నొక్కండి. అలా నోక్కగానే వేరొక విండో ఓపెన్ అవుతుంది.

6. క్రొత్త విండోలో "ఫ్యాక్స్ సర్వీసెస్" అనే ఆప్సన్ కు టిక్కు పెట్టి, "నెక్స్ట్" ను నొక్కండీ.ఒకవేళ ముందుగానే టిక్కు ఉంటే " క్యాన్సల్" నొక్కండి.





7. ఇప్పుడు సెటప్ ఇన్ స్టాల్ అయ్యి " విండోస్ ఎక్స్పి సీడీని" అడుగుతుంది.సీడీని ఉంచి ఓకే నొక్కండి.
8. చివరగా "ఫినిష్" నొక్కి అన్ని విండోస్ ను మూసేయండి. ఇప్పటికి ఫాక్స్ సర్వీస్ మీ కంప్యూటర్లో ఇన్ స్టాల్ అయ్యింది.


***ఇప్పుడు ఫ్యాక్స్ ను కాన్ ఫిగర్ చేసుకుని ఫ్యాక్స్ పంపటం/ రిసీవ్ చేసుకోవటం ఎలాగో తెలుసుకుందాం. ***


ఫ్యాక్స్ సర్వీస్ ను కాన్ ఫిగర్ చేయుట


విండోస్ లో ఫ్యాక్స్ సర్వీస్ ను కాన్ ఫిగర్ చేయుటకు:

1. స్టార్ట్--->ఆల్ ప్రోగ్రాంస్--->యాక్సెసరీస్--->కమ్యునికేషన్--->ఫ్యాక్స్---.ఫ్యాక్స్ కన్సోల్ ను క్లిక్ చేయండి.





2. ఫ్యాక్స్ కాంఫిగరేషన్ విజార్డ్ మొదలవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ను క్లిక్ చేయండి.



3. సెండర్ ఇంఫర్మేషన్ పేజ్ లో మీ వివరాలను వ్రాయండి. ( కేవలం పేరు మరియు మీ ఫ్యాక్స్ నంబర్ వ్రాస్తే సరిపోతుంది. మిగిలినవి కూడా వ్రాయవచ్చును. ఇక్కడ మీరు అందించే వివరాలు మీ ఫ్యాక్స్ రిసీవ్ చేసుకునే వారికి ఫ్యాక్స్ తో పాటూ పంపబడతాయి). ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.





4.ఇప్పుడు కనిపించే విండో లో ఫ్యాక్స్ మెషిన్ ను సెలెక్ట్ చేసుకోండి(ఇది డీఫాల్ట్ గా సెలెక్ట్ చేయబడుతుంది.). ఇప్పుడు క్రింద చిత్రంలో చూపిన విధంగా సెండ్ మరియు రిసీవ్ ఆప్సన్ లను ఏనేబుల్ చేయండి.( రిసీవ్ ఫ్యాక్స్ ను ఆటోమాటిక్ ఆన్సర్ లో ఉంచుకుంటే సౌకర్యంగా ఉంటుంది).ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.





5. ఇప్పుడు కనిపించే ట్రాస్ మిటింగ్ సబ్ స్చ్రైబర్ ఐడెంటిఫికేషన్ పేజ్ లో మీరు TSID బాక్స్ లో కనిపించాలనుకుంటున్న పేరు /మీ ఫ్యాక్స్ నంబరు/ పేరు-మీ ఫ్యాక్స్ నంబరు లలో ఏదో ఒకటి వ్రాయండి. ఇక్కడ ఏ సమాచారం ఇచ్చినా ఇబ్బంది లేదు.ఎందుకంటే మనకు దీని అవసరం పెద్దగా ఉండదు.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.





6. ఇప్పుడు కనిపించే కాల్డ్ సబ్ స్చ్రైబర్ ఐడెంటిఫికేషన్ పేజ్ లో కూడా 5 వ స్టెప్ లో లాగే సమాచారాం ఇవ్వండి. TSID మరియు CSID లు దాదాపు ఒకటే.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.



7. ఇప్పుడు రౌటింగ్ ఆప్షన్ లలో క్రింది చిత్రం లో విధంగా ప్రింట్ ఇట్ ఆన్ కు టిక్కు ఫెట్టండి(ఇందు వల్ల మీరు రిసీవ్ చేసుకున్న ఫ్యాక్స్ లను ఆటోమాటిక్ గా ప్రింట్ చేసుకో వచ్చు).ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకున్న అన్ని ఫ్యాక్స్ లను మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకోవాలంటే స్టోర్ ఎ కాపి కి టిక్కు ఉంచి మీరు ఫ్యాక్స్ లను సేవ్ చేయాలనుకునే ఫోల్డర్ను బ్రౌస్ ఆప్షన్ ద్వారా ఎన్నుకోండి.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.





8.ఇప్పుడు వచ్చిన విండో లో ఫినిష్ క్లిక్ చేయండి.





9. ఇప్పుడు వచ్చే విండోస్ సెక్యూరిటి అలెర్ట్ ను అన్ బ్లాక్ చేయండి.అంతే మీ ఫ్యాక్స్ మెషిన్ కాంఫిగర్ అయిపోయింది.







Jun 23, 2009

రాడార్ మరియూ అది పనిచేసే విదానము.


"రాడార్" ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న పదం ఇది. మరి "రాడార్" అంటే ఏమిటి, దానిని కనుగొన్నదెవరు, అది ఏలా పనిచేస్తుంది అనే విషయాలు మనలో కొందరికే తెలుసు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


మన కంటికి కనపడనంత దూరంగా వుండే వస్తువులు, ఇంకా విమానాలు వంటి వాహనాలు ఒక ప్రదేశం నుంచి సరిగ్గా ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగించే సాధనాన్నే మనం "రాడార్" అని అంటున్నాం. "రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్" అనే మాటకు సంక్షిష్టమైన రూపం ఇది. రాడార్లను ఉపయోగించి వివిధ వస్తువులు ఎంత దూరంలో ఉన్నాయి అన్న దానినే గాక తుఫానులు, ఉప్పెనలు వంటి ప్రకృతి వైపరీత్యాల ఉనికి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు.
రాడార్ ను 1904 సంవత్సరము నుండి"Christian Hulsmeyer , Nikola Tesla, Emile Girardeau, Dr. Robert M. Page , P.K. Oshchepkov" వంటి అనేకమంది శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల ఫలితంగా మొట్టమొదటిసారిగా 1934 లో " Leningrad Electrophysical Institute" అనే మిలటరీ సమస్థ " ర్యాపిడ్" అనే వ్యవస్థ ద్వారా 3 కిలోమిటర్ల పరిధిలో తిరుగుతున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ కదలికలను గుర్తించా.దాని తరువత జరిగిన ప్రయోగాల ఫలితంగా 1936 సం' లో "Zoltan Bay" అనే హంగేరియన్ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పూర్తి స్తాయి పనితనం గల RADAR వ్యవస్థను కనుగొన్నారు.


సముద్రాలలో ఒక ప్రదేశం దగ్గర ఎంత లోతుగా వుందో తెలుసుకొనేందుకై పద్ధతిని ఉపయోగిస్తారో మీకు తెలిసిందే కదా. లోతు తెలుసుకోదలచిన ప్రదేశంలో సముద్రపు ఉపరితలం నుంచి ఒక రకమైన శబ్ద తరంగాలను సముద్రగర్భంలోకి పంపిస్తారు. శబ్ద తరంగాలు సముద్రపు అడుగు భాగాన్ని తాకి పరావర్తనం చెంది, తిరిగి శబ్ద జనకాన్ని చేరుతాయి.


ఇలా తరంగాలు సముద్రపు అడుగు బాగాన్ని తాకి, తిరిగి దానిని చేరుకునేందుకు పట్టే సమయాన్ని బట్టి ఒక ప్రదేశం దగ్గర సముద్రం ఎంత లోతుగా వుందో తెలుసుకుంటారు. సరిగ్గా రకమైన టెక్నాలజీనే రాడార్ల లోనూ ఉపయోగిస్తారు. అయితే రాడార్లలో శబ్ద తరంగాలకు బదులుగా చాలా వేగంగా ప్రయాణించే 'మైక్రో వేవ్స్' (సూక్ష్మ తరంగాలు) అనే విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగిస్తారు.


సూక్ష్మ తరంగాలు కాంతి వేగంతో అంటే సెకనుకు 3,00,000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. రాడారు కేంద్రంలో వుండే ట్రాన్స్మిటర్లు, యాంటెన్నాలు వంటి పరికరాల సాయంతో సూక్ష్మ తరంగాలను అన్ని దిశలకూ ప్రసారం చేస్తాయి. రేడియో తరంగాలు వేర్వేరు వస్తువులను తాకి పరావర్తనం చెంది, తిరిగి రాడారు కేంద్రాన్ని చేరుకుంటాయి.


తరంగాలు రాడారు కేంద్రం నుంచి బయలుదేరి తిరిగి దానిని చేరుకునేందుకు ఎంత సమయం పట్టింది అనే దానిని, ఇంకా కాంతి వేగాన్ని ఆధారంగా చేసుకుని ఒక వస్తువు గాని, విమానంగాని, లేదా ఏదైనా ఖగోళ పదార్థంగాని ఒక ప్రదేశం నుంచి సరిగ్గా ఎంత దూరంలో వుందో కచ్చితంగా చెప్పగలుగుతారు.


కేవలం ఇలా దూరాలను తెలుసుకునేందుకేగాక, అంతరిక్ష నౌకలకు సందేశాలను పంపేందుకు కూడా నేడు రాడార్లను విరివిగా వాడుతున్నారు.

Jun 21, 2009

నోకియా మొబైల్ మాక్ అడ్రస్(Find Nokia Mobile's MAC Address)

ప్రస్తుతం వస్తున్న నోకియ మోడల్స్ లో ఇంటెర్నెట్ మరియు W-LAN సర్వ సాధారణంగా వస్తున్న ఫీచర్. ఫిచర్ ను కేబుల్ / బ్లూటూత్/ ఇన్ ఫ్రారెడ్ / wi-fi ద్వారా ఉపయోగిస్తుంటారు.ఇక్కడ మనం తెలుకోబోయేది "ఒకవేళ WI-FI లో ఏదైనా సమస్య వచ్చి Auto Search ద్వారా ఇంటెర్నెట్/WLAN connect కాకపోతే???ఏంటి పరిస్థితి???" ఒకసారి నాకు ఇలానే ఇబ్బంది వచ్చేసరికి ,పిచ్చెక్కియినంత పనైపొయింది..కొత్తగా మొబైల్ కొన్నాను,ఇంటెర్నెట్ పని చేయటం లేదు...ఏం చేయలో అర్థం కాక బాగా ఆలోచించాను.మొబైల్ ఒక్కసారి కొన్నాక వాపస్ ఇచ్చే ప్రసక్తే లేదు.ఇప్పుడెలా??మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్...........

సరే ఉండనే ఉందిగా మన గూగుల్ అని నా సమస్యకు పరిస్కారమా ఏక్కడున్నావ్ అంటు దేవులాడటం ప్రారంభించాను.అప్పుడే తట్టింది నా బుర్రకి ఒక ఆలోచన.అదేంటంటే "కంప్యూటర్ ను మాక్ అడ్రెస్ ద్వారా WLAN కు అనుసంధానించినప్పుడు, ఇంటెర్నెట్ ఫీచర్ ఉన్న మొబైల్ ను ఎందుకు ట్రై చేయకూదదని?"(ఆ ఆలోచన వచ్చేవరకు మొబైల్ కు మాక్ అడ్రెస్ ఉంటుందని నాకు తెలియదు)...అలా వెదికి వెదికి చివరకు క్రింది కోడ్ ను చూసాను.


*#62209526#


ఇంకేముంది?అలా కనుక్కొన్న మాక్ అడ్రస్ ద్వారా నా మొబైల్ యొక్క మాక్ అడ్రెస్ ను కనుక్కుని,దాని ద్వారా ఇంటెర్నెట్ ను కనెక్ట్ చేసుకున్నాను.ఇప్పుడు ఆఫీస్ లో ఖాళీ గా ఉన్న సమయాలలో నా మొబైల్ లోకి ఇంటెర్నెట్ ద్వారా కావలసిన సమాచారాన్ని దిగుమతి చేసుకుంటున్నాను.

Jun 11, 2009

పాత స్నేహితుల జాడకై నిరీక్షిస్తూ...

హలో,

నేను 2003-06 సం'' లో లయోలా డిగ్రీ కాలేజి, పులివెందులలో చదివాను.ప్రస్తుతం నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉన్నారు. ఆందరిని తిరిగి కలవటం సాద్యంకాదని నాకు తెలుసు. ఆందుకే కనీసం వారితో ఉన్న స్నేహాన్ని కొనసాగిద్దామన్న సలహా పై మా స్నేహితులు ఒక సైట్ చేసి అందులో మాకు టచ్ లో ఉన్న వారి వివరాలు ఉంచుతున్నాము.ఇలా అయినా కనీసం ఆ సైట్ చూసినవారు వారి పాత మిత్రులతో(ఒకవేళ ఆ సైట్లో వారి వివరాలు ఉంటే) ఈమెయిలు లేదా చాటింగ్ చెయటం, వారి ఫోటోలైనా చూడటం కుదురుతుందన్న చిన్న ఆశ.


కావున మీలో ఎవరికైనా మా స్నేహితుల గురించిన సమాచరం తెలిస్తే దయచేసి మాకు చెప్పండి.లేదా మీకు తెలిసిన మా స్నేహితులకు మా సైటును తెలియజేయండి.


మా సైటు: Click Here

మీరు అందించే సహాయానికి ముందస్తు దన్యవాదములు....