Jun 23, 2009

రాడార్ మరియూ అది పనిచేసే విదానము.


"రాడార్" ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న పదం ఇది. మరి "రాడార్" అంటే ఏమిటి, దానిని కనుగొన్నదెవరు, అది ఏలా పనిచేస్తుంది అనే విషయాలు మనలో కొందరికే తెలుసు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


మన కంటికి కనపడనంత దూరంగా వుండే వస్తువులు, ఇంకా విమానాలు వంటి వాహనాలు ఒక ప్రదేశం నుంచి సరిగ్గా ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగించే సాధనాన్నే మనం "రాడార్" అని అంటున్నాం. "రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్" అనే మాటకు సంక్షిష్టమైన రూపం ఇది. రాడార్లను ఉపయోగించి వివిధ వస్తువులు ఎంత దూరంలో ఉన్నాయి అన్న దానినే గాక తుఫానులు, ఉప్పెనలు వంటి ప్రకృతి వైపరీత్యాల ఉనికి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు.
రాడార్ ను 1904 సంవత్సరము నుండి"Christian Hulsmeyer , Nikola Tesla, Emile Girardeau, Dr. Robert M. Page , P.K. Oshchepkov" వంటి అనేకమంది శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల ఫలితంగా మొట్టమొదటిసారిగా 1934 లో " Leningrad Electrophysical Institute" అనే మిలటరీ సమస్థ " ర్యాపిడ్" అనే వ్యవస్థ ద్వారా 3 కిలోమిటర్ల పరిధిలో తిరుగుతున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ కదలికలను గుర్తించా.దాని తరువత జరిగిన ప్రయోగాల ఫలితంగా 1936 సం' లో "Zoltan Bay" అనే హంగేరియన్ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పూర్తి స్తాయి పనితనం గల RADAR వ్యవస్థను కనుగొన్నారు.


సముద్రాలలో ఒక ప్రదేశం దగ్గర ఎంత లోతుగా వుందో తెలుసుకొనేందుకై పద్ధతిని ఉపయోగిస్తారో మీకు తెలిసిందే కదా. లోతు తెలుసుకోదలచిన ప్రదేశంలో సముద్రపు ఉపరితలం నుంచి ఒక రకమైన శబ్ద తరంగాలను సముద్రగర్భంలోకి పంపిస్తారు. శబ్ద తరంగాలు సముద్రపు అడుగు భాగాన్ని తాకి పరావర్తనం చెంది, తిరిగి శబ్ద జనకాన్ని చేరుతాయి.


ఇలా తరంగాలు సముద్రపు అడుగు బాగాన్ని తాకి, తిరిగి దానిని చేరుకునేందుకు పట్టే సమయాన్ని బట్టి ఒక ప్రదేశం దగ్గర సముద్రం ఎంత లోతుగా వుందో తెలుసుకుంటారు. సరిగ్గా రకమైన టెక్నాలజీనే రాడార్ల లోనూ ఉపయోగిస్తారు. అయితే రాడార్లలో శబ్ద తరంగాలకు బదులుగా చాలా వేగంగా ప్రయాణించే 'మైక్రో వేవ్స్' (సూక్ష్మ తరంగాలు) అనే విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగిస్తారు.


సూక్ష్మ తరంగాలు కాంతి వేగంతో అంటే సెకనుకు 3,00,000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. రాడారు కేంద్రంలో వుండే ట్రాన్స్మిటర్లు, యాంటెన్నాలు వంటి పరికరాల సాయంతో సూక్ష్మ తరంగాలను అన్ని దిశలకూ ప్రసారం చేస్తాయి. రేడియో తరంగాలు వేర్వేరు వస్తువులను తాకి పరావర్తనం చెంది, తిరిగి రాడారు కేంద్రాన్ని చేరుకుంటాయి.


తరంగాలు రాడారు కేంద్రం నుంచి బయలుదేరి తిరిగి దానిని చేరుకునేందుకు ఎంత సమయం పట్టింది అనే దానిని, ఇంకా కాంతి వేగాన్ని ఆధారంగా చేసుకుని ఒక వస్తువు గాని, విమానంగాని, లేదా ఏదైనా ఖగోళ పదార్థంగాని ఒక ప్రదేశం నుంచి సరిగ్గా ఎంత దూరంలో వుందో కచ్చితంగా చెప్పగలుగుతారు.


కేవలం ఇలా దూరాలను తెలుసుకునేందుకేగాక, అంతరిక్ష నౌకలకు సందేశాలను పంపేందుకు కూడా నేడు రాడార్లను విరివిగా వాడుతున్నారు.

No comments: