మనం ఎవరికైనా ఫ్యాక్స్ పంపించాలన్నా లేక రీసీవ్ చేసుకోవాలన్నా " ఫోన్ లైన్ మరియు ఫ్యాక్స్ మెషిన్ " తప్పకుండా అవసరం అవుతాయి. ఒకవేళ ఫ్యాక్స్ మెషిన్ లో కాట్రేజ్ అయిపోతే, దానికి మళ్ళీ కాట్రేజ్ కొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్యాక్స్ మెషిన్ మరియు కాట్రేజ్ ల గొడవ లేకుండా కంప్యుటర్ ద్వారా ఫ్యాక్స్ పంపించే / రీసీవ్ చేసుకునే వీలుంటే, అన్ని సెండ్/రిసీవ్ ఫ్యాక్స్ లను సేవ్ చేసుకుని, అవసరమైన వాటిని మాత్రమె ప్రింట్ తీసుకునే వీలుంటే???ప్రతీ ఫ్యాక్స్ ను ప్రింట్ తీయటం మరియు కాట్రేజ్ లు కొనడం లాంటి బాధలు తప్పుతాయి. మరి అలాంటి వెసులుబాటు ఉందా????? ఖచ్చితంగా ఉంది. మరి అదెలాగో తెలుసుకుందామా??? పందండి...
***ఇందుకోసం మనకు ఒక ఫోన్ లైన్ మరియు ఒక కంప్యూటర్ అవసరం అవుతాయి.***
గమనిక: మీరు ఫ్యాక్స్ పంపాలనుకునే డాక్యుమెంట్ పేపర్ పైన ఉంటే దానిని స్కాన్ చేసి, ఫ్యాక్స్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఆ డాక్యుమెంట్ కంప్యూటర్ లోనే ఉంటే సమస్యే లేదు.
1: ముందుగా మీ కంప్యూటర్ మోడం ను ఫోన్ లైన్ కు క్రింది చిత్రంలో చూపిన విధంగా కలపండి.
3.ఆపై స్టార్ట్ మెను ద్వారా కంట్రోల్ ప్యానాల్ లోకి వెళ్ళండి.
4.యాడ్ /రిమూవ్ ప్రోగ్రాంస్ ను నొక్కండి. ఇప్పుడు ఒక క్రొత్త విండో ఓపెన్ అవుతుంది.
5. ఇప్పుడు పటంలో చూపిన విధంగా " యాడ్ /రిమూవ్ విండోస్ కాంపోనెంట్" ను నొక్కండి. అలా నోక్కగానే వేరొక విండో ఓపెన్ అవుతుంది.
6. ఆ క్రొత్త విండోలో "ఫ్యాక్స్ సర్వీసెస్" అనే ఆప్సన్ కు టిక్కు పెట్టి, "నెక్స్ట్" ను నొక్కండీ.ఒకవేళ ముందుగానే టిక్కు ఉంటే " క్యాన్సల్" నొక్కండి.

7. ఇప్పుడు సెటప్ ఇన్ స్టాల్ అయ్యి " విండోస్ ఎక్స్పి సీడీని" అడుగుతుంది.సీడీని ఉంచి ఓకే నొక్కండి.
8. చివరగా "ఫినిష్" నొక్కి అన్ని విండోస్ ను మూసేయండి. ఇప్పటికి ఫాక్స్ సర్వీస్ మీ కంప్యూటర్లో ఇన్ స్టాల్ అయ్యింది.
***ఇప్పుడు ఫ్యాక్స్ ను కాన్ ఫిగర్ చేసుకుని ఫ్యాక్స్ పంపటం/ రిసీవ్ చేసుకోవటం ఎలాగో తెలుసుకుందాం. ***
ఫ్యాక్స్ సర్వీస్ ను కాన్ ఫిగర్ చేయుట
విండోస్ లో ఫ్యాక్స్ సర్వీస్ ను కాన్ ఫిగర్ చేయుటకు:
1. స్టార్ట్--->ఆల్ ప్రోగ్రాంస్--->యాక్సెసరీస్--->కమ్యునికేషన్--->ఫ్యాక్స్---.ఫ్యాక్స్ కన్సోల్ ను క్లిక్ చేయండి.


3. సెండర్ ఇంఫర్మేషన్ పేజ్ లో మీ వివరాలను వ్రాయండి. ( కేవలం పేరు మరియు మీ ఫ్యాక్స్ నంబర్ వ్రాస్తే సరిపోతుంది. మిగిలినవి కూడా వ్రాయవచ్చును. ఇక్కడ మీరు అందించే వివరాలు మీ ఫ్యాక్స్ రిసీవ్ చేసుకునే వారికి ఫ్యాక్స్ తో పాటూ పంపబడతాయి). ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.


5. ఇప్పుడు కనిపించే ట్రాస్ మిటింగ్ సబ్ స్చ్రైబర్ ఐడెంటిఫికేషన్ పేజ్ లో మీరు TSID బాక్స్ లో కనిపించాలనుకుంటున్న పేరు /మీ ఫ్యాక్స్ నంబరు/ పేరు-మీ ఫ్యాక్స్ నంబరు లలో ఏదో ఒకటి వ్రాయండి. ఇక్కడ ఏ సమాచారం ఇచ్చినా ఇబ్బంది లేదు.ఎందుకంటే మనకు దీని అవసరం పెద్దగా ఉండదు.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.

6. ఇప్పుడు కనిపించే కాల్డ్ సబ్ స్చ్రైబర్ ఐడెంటిఫికేషన్ పేజ్ లో కూడా 5 వ స్టెప్ లో లాగే సమాచారాం ఇవ్వండి. TSID మరియు CSID లు దాదాపు ఒకటే.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.

7. ఇప్పుడు రౌటింగ్ ఆప్షన్ లలో క్రింది చిత్రం లో విధంగా ప్రింట్ ఇట్ ఆన్ కు టిక్కు ఫెట్టండి(ఇందు వల్ల మీరు రిసీవ్ చేసుకున్న ఫ్యాక్స్ లను ఆటోమాటిక్ గా ప్రింట్ చేసుకో వచ్చు).ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకున్న అన్ని ఫ్యాక్స్ లను మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకోవాలంటే స్టోర్ ఎ కాపి కి టిక్కు ఉంచి మీరు ఫ్యాక్స్ లను సేవ్ చేయాలనుకునే ఫోల్డర్ను బ్రౌస్ ఆప్షన్ ద్వారా ఎన్నుకోండి.ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.

8.ఇప్పుడు వచ్చిన విండో లో ఫినిష్ క్లిక్ చేయండి.

9. ఇప్పుడు వచ్చే విండోస్ సెక్యూరిటి అలెర్ట్ ను అన్ బ్లాక్ చేయండి.అంతే మీ ఫ్యాక్స్ మెషిన్ కాంఫిగర్ అయిపోయింది.

ఫ్యాక్స్ పంపడము
మీరు ఫ్యాక్స్ పంపాలనుకునే ఫైల్ మీ కంప్యూటర్ లో ఉంటే క్రింది స్టెప్స్ ద్వారా నేరుగా ఫ్యాక్స్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఫ్యాక్స్ పంపాలనుకునే సమాచారం పేపర్ పైన ఉంటే మాత్రం, దానిని స్కాన్ చేసి పంపాల్సి ఉంటుంది.(ఇదే ఈ పద్దతి లో ఉన్న ఒకే ఒక లోపం)
1. | మీరు ఫ్యాక్స్ పంపాలనుకునే ఫైల్ ను తెరవండి. |
2. | ఫైల్ మెను లో ప్రింట్ ఆప్షన్ ను క్లిక్ చేయండి. |
3. | ఇప్పుడు వచ్చే ప్రింట్ డైలాగ్ బాక్స్ లో సెలేక్ట్ ప్రింటర్ ద్వారా ఫ్యాక్స్ అనే ప్రింటర్ ను సెలెక్ట్ చేసుకుని ప్రింట్ ఇవ్వండి. |
4.ఇప్పుడు కనిపించే సెండ్ ఫ్యాక్స్ విజార్డ్ లో నెక్స్ట్ ను క్లిక్ చేయండి.![]() | |
5.ఇప్పుడు కనిపించే రిసీపెంట్ ఇంఫర్మేషన్ పేజి లో "టు" బాక్స్ లో మీరు ఫ్యాక్స్ పంపాలనుకునే వారి పేరు మరియు ఫ్యాక్స్ నంబర్ అనే బాక్స్ లో వారి "ఫ్యాక్స్ నంబరు" ఎంటర్ చేయండి. ( ఒకే ఫ్యాక్స్ ఒకరికంటే ఎక్కువ మందికి పంపాలనుకుంటే ఇలాగే పేరు , ఫ్యాక్స్ నంబర్ ఎంటర్ చేసి "యాడ్" ను నొక్కండి.) ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి.![]() | |
6. ఇప్పుడు వచ్చే కవర్ పేజ్ విండో లో సెలెక్ట్ ఎ కవర్ పేజ్ ను టిక్ చేసి మీకు కావలసిన కవర్ పేజ్ ను సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి.( ఈ సెలెక్ట్ ఎ కవర్ పేజ్ అనేది ఫ్యాక్స్ రిసీవ్ చేసుకునే వారికి ఒక పేపరు వేస్ట్ చేయడనికి తప్ప వేరే ఉపయోగం పెద్దగా లేదని నా అభిప్రాయము. కావును ఈ ఆప్షన్ ను డిసేబుల్ చేయటమే మంచిది.)![]() | |
7. షెడ్యూల్ పేజ్ లో నెక్స్ట్ క్లిక్ చేయండి.(సాధారణంగా క్రింది ఆప్షన్ లు "నవ్" మరియు " నార్మల్" గానే సెలెక్ట్ చేయబడి ఉంటాయి.)![]() | |
8.ఇప్పుడు కనిపించే విండో లో ఫినిష్ ను క్లిక్ చేస్తే చాలు మీ ఫ్యాక్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.(మీరు పంపించే ఫ్యాక్స్ ను ఇక్కడ ఉన్న ప్రివ్యూ అనే ఆప్షన్ ద్వారా సరిచూస్కో వచ్చు.)![]() |
ఫ్యాక్స్ రిసీవ్ చేసుకోవడం
1. స్టార్ట్--->ఆల్ ప్రోగ్రాంస్--->యాక్సెసరీస్--->కమ్యునికేషన్--->ఫ్యాక్స్---.ఫ్యాక్స్ కన్సోల్ ను క్లిక్ చేయండి.( ఇలా చేయడం అంటే మీ ఫ్యాక్స్ మెషిన్ ఆన్ చేయబడి నట్లు లెక్క. ఇది ఎల్లప్పుడూ టాస్క్ బార్ మీద మినిమైజ్ చేయబడి ఉంచాలి. ఒకవేళ ఈ ఫ్యాక్స్ కన్సోల్ క్లోజ్ చేయబడి ఉందంటే ఫ్యాక్స్ మెషిన్ ఆఫ్ చేసినట్లు అర్థం.)![]() | |
2-అ.ఆటోమాటిక్ గా: " ఫ్యాక్స్ సర్వీస్ ను కాన్ ఫిగర్ చేయుట"--->స్టెప్ 4 లో రిసీవ్ ఫ్యాక్స్ ను ఆటోమాటిక్ ఆన్సర్ ను సెలెక్ట్ చేసుకుని ఉంటే మీకు ఇతరులనుండి వచ్చే ఫ్యాక్స్ ఆటోమాటిక్ గా వస్తుంది.క్రింది పటంలో విధంగా ".ఫ్యాక్స్ కన్సోల్" లోని ఇన్ బాక్స్ ను క్లిక్ చేస్తే మీరు రిసీవ్ చేసుకున్న అన్ని ఫ్యాక్స్ లు కుడి చేతి వైపు కనిపిస్తాయి. |

2-ఆ .మాన్యువల్ గా
మీకు ఏవరైనా ఫ్యాక్స్ పంపించేటప్పుడు ఫ్యాక్స్ కన్సోల్ ---> ఫైల్--->క్లిక్" రిసీవ్ ఫ్యాక్స్ " ను క్లిక్ చేయాలి. (రిసీవ్ ఫ్యాక్స్ ను ఆటోమాటిక్ ఆన్సర్ లో ఉంచుకుంటే సౌకర్యంగా ఉంటుంది)![]() |
The Fax Monitor appears and waits for the incoming fax. When the phone rings, the Fax Monitor will automatically answer, connect with the remote fax machine, and receive the fax. After you have received the fax, you can leave the Fax Monitor open to automatically receive more faxes, or you can close it to manually receive faxes.

పైన అందిందించిన సమాచారం మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తూ...
1 comment:
thank u
Post a Comment