అనగనగా ఒక ఊరు.ఆ ఊరి గుడి దగ్గర ఒక కోతి.ఒక రోజు ఒక భక్తుడూ దేవున్ని దర్శనం చేసుకుని, కొబ్బరికాయ కొట్టీ.పూజారి లాక్కోగా మిగిలిన చిప్పతో గుడి మెట్లు దిగుతుండగా....సడన్ గా ఆ కోతొచ్చి ఆ మిగిలిన కొబ్బరిచిప్పను కూడా లాకెళ్ళింది.ఇప్పుడు ఆ కోతి భక్తుడి నోటి దగ్గర లాక్కొన్న కొబ్బరి చిప్పను తింటుందా?? పడేస్తుందా?? ఏమో ఏమైనా చేయ్యొచ్చు. కదా?
సేం టు సేం పైన చెప్పిన కోతిలాంటి మనిషి నా కొక్కడు తగిలాడు. ఎవడబ్బా అనుకుంటున్నారా?? ఇంకెవ్వరు మన కే.సీ.ఆర్.
ఎందుకంటారా? అయితే వినండి.తెలుగుదేశం లో చేరక ముందు కే.సీ.ఆర్ అంటే ఎవరో ఎవ్వరికీ తెలీదు.అన్నీ కుదిరాకేమో తెలంగాణా అంటూ ఒక పార్టీ పెట్టాడు,కొతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.సర్లే పార్టీ పెట్టాడు అతని కష్టాలు అతనివి అనుకుంటే, యం.పీ గా గెలిచాడు,మూన్నాల్లకే రాజినామా చేసాడు.మళ్ళీ సేం టు సేం రిపీట్ చేసాడు. మన రాష్ట్రంలో ఒక్క యం.పీ గెలవాలంటే నల్ల ధనం , తెల్ల ధనం అంతా కలిపి కనీసం పాతిక కోట్లు ఖర్చు.
" ఎవడబ్బా సొమ్మని లెక్క పత్రం లేక లక్షలు లక్షలు తింటివి రామాచంద్రా" అని రామదాసే రాముడిని అడగాడట.కానీ మన వెర్రి జనం మాత్రం తెలంగాణా తెస్తాడని గుద్దుతున్నారు ఓట్లు. వాడికేమో తినింది అరగక వాగుతున్నాడు. రీసెంట్ గా
" జాగోరే తెలంగాణా, భాగోరే ఆంద్రావాలా" అంటూ విపరీత వాఖ్యలు చేసి నోటి దూల తీర్చుకున్నాడు.
అది చాలదన్నట్లు ఈ కోతికి కొబ్బరి చిప్ప పోయి కత్తి దొరికింది.
" తెలంగాణా గన్ టీ.వి" పెడుతున్నాడంట. కంగారు పడకండి డబ్బులాడివి కాదు. డొనేషన్స్. నిన్నొక కామేంట్ చేసాడు
" చిటికేస్తే కోట్లు కుమ్మరిస్తారు ఎన్నారైలు" అని.మరి ఈ కోతేం చేస్తుందో వేచి చూడాలి,లేదా కొబ్బరి చిప్ప లాక్కుని కోతుల్ని జూ లో పెట్టినట్లు ఈ దొరను యం.పీ గా దించేసి, రాజకీయాల్లొంచి తరిమేయ్యాలి.
ష్........మెల్లగా చదవండి మళ్ళీ మనోడు విన్నాడాంటే
" తెలంగాణా వారికి సపరేట్ బ్లాగులు, సపరేట్ ఇంటర్నేట్ (ఆంద్రావాళ్ళు యాక్సెస్ చెయ్యలేరు.ఓన్లీ ఫర్ టెలంగాణా) " అంటాడు..
గమనిక:
ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.