Nov 25, 2009

తొక్కలో ప్రాణాలు



 మొన్నీ మద్య అర్ ఫిజాన్ క్యాంప్ దగ్గరకు వెళుతుంటే ఒక దృశ్యం కంటపడింది. అదేంటంటే వాటర్ రిహబిలేషన్ చేసే ట్యాంక్ లో ఏదో రిపేర్ ఉందనుకుంటా, ఒక హెలికాఫ్టర్ లోంచి మనిషిని అందులోకి తాడుకట్టి మరీ దించారు.పని అయ్యేంత వరకు హెలికాఫ్టర్ గాల్లోనే ఉంది లోపలున్న మనిషిని పట్టుకుని.
నాకైతే ముందు ఇదేం విడ్డురం రా బాబూ లోపల మనిషిని దించేసి పోవచ్చుకదా అనిపించింది. కానీ ఆలోచిస్తే అర్థమైంది సేఫ్టీ కోసం అని.

                         


మరి ఇండియా లో అయితే????       

ఇంత కంపులో దిగడం ఒక ఎతైతే తరువాతరువాత వచ్చే రోగాల సంగతేమిటి??
  
అంత ఎత్తునుంచి పడితే వీళ్ళ గతేంటి???  

మన కన్నా చిన్న దేశాలు టెక్నాలజీ లో ముందుంటే, మన రాజకీయ నాయకులు మాత్రం అవినీతిలో ముందుంచారు మన దేశాన్ని.వాళ్ళకు డబ్బులొచ్చే పథకాలే కానీ ప్రజల ప్రాణాలు అవసరం లేదు. మరి ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో???? 
ఒక వేళ ఎవరైనా అడిగితే "మన దేశంలో జనాభా ఎక్కువ.అన్ని సౌకర్యాలు కల్పిస్తే జనాభా తగ్గటమెలాగంటారేమో మరి???"


5 comments:

సుభద్ర said...

ఇ౦డియా లో దేవుళ్ళు ఎక్కువ కదా!!!....అ౦దుకే దేవుడి మీద భార౦ వేసి రిస్క్ తీసుకు౦టారేమొ తమ్ముడు...

జయ said...

మరీ అంతలా తొక్కలో ప్రాణాలు అని తీసేస్తే ఎలా సురేష్ గారు, ఏదైనా మార్గం చూడాలి గాని.

Suresh said...

@జయ గారు,

ఏదైనా మార్గం చూడాలనే నా కోరిక కూడా.కానీ మన నాయకులు చెప్పందే ఏ అధికారి ప్రణాళిక సిద్ధం చెయ్యరు కదండీ? వాళ్ళు ఏదైనా మార్గం ఆలోచించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది.

@సుభద్ర అక్కా,

నిజమే.లేకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పి పోయిన్నపుడూ, వరదలొచ్చినప్పుడూ అంత మత్తుగా ఉండేవారు కాదు.బహుశా దేవునిపై భారం వేసేశారేమో.

శిశిర said...

మీరన్నట్టు మన వ్యవస్థలో చాలా మార్పు రావాలి.

Suresh said...

@శిశిర
మంచి జరగాలని ఆశిద్దాం.అంతకు మించి మనమేమీ చెయ్యలేం.చెయ్యాలనే ఆలోచన వచ్చినా పాలిట్రిక్స్ ఒప్పుకోవు