అనగనగా ఒక ఊరు.ఆ ఊరి గుడి దగ్గర ఒక కోతి.ఒక రోజు ఒక భక్తుడూ దేవున్ని దర్శనం చేసుకుని, కొబ్బరికాయ కొట్టీ.పూజారి లాక్కోగా మిగిలిన చిప్పతో గుడి మెట్లు దిగుతుండగా....సడన్ గా ఆ కోతొచ్చి ఆ మిగిలిన కొబ్బరిచిప్పను కూడా లాకెళ్ళింది.ఇప్పుడు ఆ కోతి భక్తుడి నోటి దగ్గర లాక్కొన్న కొబ్బరి చిప్పను తింటుందా?? పడేస్తుందా?? ఏమో ఏమైనా చేయ్యొచ్చు. కదా?
సేం టు సేం పైన చెప్పిన కోతిలాంటి మనిషి నా కొక్కడు తగిలాడు. ఎవడబ్బా అనుకుంటున్నారా?? ఇంకెవ్వరు మన కే.సీ.ఆర్.
ఎందుకంటారా? అయితే వినండి.తెలుగుదేశం లో చేరక ముందు కే.సీ.ఆర్ అంటే ఎవరో ఎవ్వరికీ తెలీదు.అన్నీ కుదిరాకేమో తెలంగాణా అంటూ ఒక పార్టీ పెట్టాడు,కొతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.సర్లే పార్టీ పెట్టాడు అతని కష్టాలు అతనివి అనుకుంటే, యం.పీ గా గెలిచాడు,మూన్నాల్లకే రాజినామా చేసాడు.మళ్ళీ సేం టు సేం రిపీట్ చేసాడు. మన రాష్ట్రంలో ఒక్క యం.పీ గెలవాలంటే నల్ల ధనం , తెల్ల ధనం అంతా కలిపి కనీసం పాతిక కోట్లు ఖర్చు." ఎవడబ్బా సొమ్మని లెక్క పత్రం లేక లక్షలు లక్షలు తింటివి రామాచంద్రా" అని రామదాసే రాముడిని అడగాడట.కానీ మన వెర్రి జనం మాత్రం తెలంగాణా తెస్తాడని గుద్దుతున్నారు ఓట్లు. వాడికేమో తినింది అరగక వాగుతున్నాడు. రీసెంట్ గా " జాగోరే తెలంగాణా, భాగోరే ఆంద్రావాలా" అంటూ విపరీత వాఖ్యలు చేసి నోటి దూల తీర్చుకున్నాడు.
అది చాలదన్నట్లు ఈ కోతికి కొబ్బరి చిప్ప పోయి కత్తి దొరికింది. " తెలంగాణా గన్ టీ.వి" పెడుతున్నాడంట. కంగారు పడకండి డబ్బులాడివి కాదు. డొనేషన్స్. నిన్నొక కామేంట్ చేసాడు" చిటికేస్తే కోట్లు కుమ్మరిస్తారు ఎన్నారైలు" అని.మరి ఈ కోతేం చేస్తుందో వేచి చూడాలి,లేదా కొబ్బరి చిప్ప లాక్కుని కోతుల్ని జూ లో పెట్టినట్లు ఈ దొరను యం.పీ గా దించేసి, రాజకీయాల్లొంచి తరిమేయ్యాలి. ష్........మెల్లగా చదవండి మళ్ళీ మనోడు విన్నాడాంటే " తెలంగాణా వారికి సపరేట్ బ్లాగులు, సపరేట్ ఇంటర్నేట్ (ఆంద్రావాళ్ళు యాక్సెస్ చెయ్యలేరు.ఓన్లీ ఫర్ టెలంగాణా) " అంటాడు..
గమనిక: ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.
6 comments:
నీ బ్లాగు టైటిల్ కి నీ ఈ పోస్ట్ కి ఏమైనా సంబంధం ఉందా... నీ వ్యక్తి గత అభిప్రాయాలు సోది లా ఉన్నాయి... నువ్వు యువకుడివి కాదు ఒక ముసలోడివి, చాదస్తం ఉన్న ముసలోడివి,చాదస్తం ఉన్న ఆంధ్రా ముసలోడివి అని నా అభిప్రాయం..... నాయనా.. జ్ఞానం అన్నావు...నీకుందా అది... ద్వేషం,కోపం నీ మనసులో ఉంది అని చాటిచెప్పావు.... ఇలాంటివి(కెసీఆర్ రాజీనామాలు) అర్థవంతం గా, వివరిస్తూ రాస్తే..బావుండేదేమో.....
..బయట పెడితే ఇలానే ఉంటది..
గమనిక: ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.
సారీ అండీ, నిన్న ఎందుకో టెంప్లెట్ మార్చాలనిపించింది.మార్చేసాను. కానీ టెంప్లెట్ కు తగిని ఫాంట్ కలర్ మార్చేలోపల కొంచెం పనిపడి బయటకు పోవలసి వచ్చింది. అందుకే ఆలస్యమైంది.ఇప్పుడు ఒకే కదా? ఏవైనా తప్పులుంటే చెప్పండి, మార్చడనికి ప్రయత్నిస్తాను.
నమస్తే Ramachandran గారు,
న్యాయం అడిగే వాళ్ళందరూ ముసలివాలైతే నేను తప్పకుండా ముసలివాడినే సోదరా.ఇక నా బ్లాగ్ టైటిల్ విషయానికొస్తే జ్ఞానం అంటే నా దృస్టిలో విషయాన్ని గురించిన అవగాహన మరియు తెలిసిన విషయాలు నలుగురితో పంచుకోమని నా టైటిల్ యొక్క అంతరార్థం.మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను.ఏదో దొరికాయి కదా అని వందల కొద్దీ పోస్ట్ చెయ్యటం నాకు ఇష్టం ఉండదు.కింద రాసిన అసెంబ్లీ కథ జ్ఞానం పెంచే విషయం కాదంటారా???నాకు ఏ పార్టీ పైనా అభిమానం లేదు. మంచి చేసే వాళ్ళను అనవసరంగా నిందించడం నా అభిమతం కాదు.కొన్ని నెలలముందు అనగా ఎలక్షన్ సమయంలో కే.సీ.ఆర్ గారు " ఆంద్రావాళ్ళు మా సోదరులు, వారికి ఏకష్టమొచ్చినా తీర్చేందుకు నేను ముందుంటాను," అన్నారు.నిన్నేమో ఇలా....అలోచించండి ఎవ్వరికి ఎవరిపైన కోపమో, ద్వేషమో...నిన్న మరికొన్ని అర్థవంతమైన పదాలు వివరించారు,మీ అద్యక్షులవారు.అవేంటో తెలుసా???? చదవండివి
బద్మాష్: బద్=చెడు + మాష్=తినడం =చెడ్డ పని చేసి మన్ను తినేవాడూ
బేఖార్: పని తెలియని వాడు.
సనాసి: పనికిరాని వాడు.
ఇలా చాలానే చెప్పాడు.
పనిలొ పనిగా ఈ పదాలన్నింటినీ దివంగత వై.యస్ గారి పైన కూడా వాడారు.చనిపోయినవారిని కించపరచడమేమో న్యాయం,అదేంటని అడిగితే ముసలోడిని చేసేసారు.బహుశా మీరు టి.ఆర్.యస్ కార్యకర్త కాబోలు.ఐదు వేళ్ళూ కలిస్తేనే బలం, ఒక్కటే ఉంటే కాదు.ఆలోచించండి.లేదు మీరే కరెక్ట్ అనుకుంటే దగ్గర్లో జైల్ బరో ఉంది వెళ్ళి పాల్గొనండీ.ఆల్ ది బెస్ట్...
మీ సెటైర్ బాగుంది. రామచంద్రన్ గారికి రాసిన జవాబు బాగుంది. కానీ కె.సి.ఆర్.ని దృష్టిలో వుంచుకొని తెలంగాణా వాసుల న్యాయమైన డిమాండ్లను మనం అంగీకరించకతప్పదు.కోస్తావాడా, రాయలసీమవాడా అన్నది కాదుకానీ నిజానికి వారికి అన్యాయం జరిగిందన్నదాంట్లో సత్యం వుంది. నదీజలాల వినియోగంలో కానీ, ఉద్యోగాల కేటాయింపులోకానీ, ప్రాజెక్టుల రూపకల్పనలో కానీ వారి గోడు ఇన్నాళ్ళు అరణ్యరోదనే అయ్యింది. మరొకమారు ఆలోచించగలరు.
వర్మ గారు,
ముందుగా నా బ్లాగు దర్శించినందుకు కృతజ్నతలు.
తెలంగాణా ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న మాట నూటికి నూరు శాతం నిజం.అది నేను కూడా ఒప్పుకుంటాను.కానీ వాళ్ళకు న్యాయం జరగాలంటూ కే.సి.ఆర్ చేసే పనులే అంత బాగాలేవు.నేను అతను చేసే పనుల గురించి మాత్రమే విమర్శించాను, తెలంగాణా వాళ్ళను కాదు.వాళ్ళూ మన సోదరులే కదా.వాళ్ళనెందుకు విమర్శిస్తాను.
తెలంగాణా ప్రజల కష్టాలు కే.సి.ఆర్ ఒక్కడికే కాదు, మనకు కూడా బాధకలిగిస్తాయి.ఇప్పటికైనా మన రాజకీయనాయకులు కళ్ళు తెరిచి వాళ్ళకు న్యాయం చేయ్యాలని కోరుకుందాం.కే.సి.ఆర్ ఒక్కడే కాదు, మిగిలిన ప్రాంతాల నాయకులకు కూడా తెలంగాణా అభివృద్దికై పోరాడాల్సిన బాద్యత వుంది.
Post a Comment